‘లాల్ సలామ్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో భారత మాజీ క్రికెటర్

-

ఈ ఏడాది ‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ . ఈ జోష్​లో ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే జై భీమ్ ద‌ర్శ‌కుడితో త‌లైవ 170 సినిమా చేస్తున్న ర‌జనీ.. త‌న కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో ‘లాల్‌సలామ్‌’ అనే సినిమామ చేస్తున్నాడు. విష్ణువిశాల్‌, విక్రాంత్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ ‘కపిల్‌ దేవ్‌’ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన లాల్‌ సలామ్‌ టైటిల్ పోస్టర్‌తో పాటు దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

Pics: Kapil Dev wraps up dubbing for Aishwarya Rajinikanth's 'Laal Salaam'  - India Today

తన పాత్ర కోసం కపిల్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. తాజాగా కపిల్ డబ్బింగ్ పూర్తయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. ప్రస్తుతం ‘లాల్ సలామ్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపింది. 2024 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, అనసూయ, తంబిరామయ్య తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఓ పాత్ర పోషిస్తుండడం విశేషం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news