కేంద్రం ఎన్నో రకాల స్కీమ్ ని తీసుకు వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ చాలా మందికి ప్రయోజనకరంగా వుంది. అయితే ఈ స్కీమ్ కేవలం ఆడ పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ వలన ఆడ పిల్లలకి చక్కటి మేలు కలుగుతుంది.
ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు వున్నా సరే ఈ పథకంలో చేరొచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరడం వలన ఉన్నత చదువులు, పెళ్లి వంటి అవసరాలకు డబ్బుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎవరు ఈ స్కీమ్ లో చేరచ్చు అనేది చూస్తే.. పదేళ్ల లోపు ఆడ పిల్లలను ఈ పథకం లో చేర్పించొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నింటిలోకెల్లా ఈ పథకంలోనే అధిక వడ్డీ రేటు పొందొచ్చు. ఇక ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం ద్వారా 7.6 శాతంవడ్డీ లభిస్తుంది.
అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకో వచ్చు. ఈ స్కీమ్ ని ఓపెన్ చెయ్యడం కూడా ఈజీనే. దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. వెళ్లి చేరొచ్చు. ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ప్రతీ నెలా ఎంతైనా కట్టచ్చు. దీనిలో నియమం ఏమి లేదు. నెలకు రూ.12500 కడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి దాదాపు రూ.65 లక్షల వరకు వస్తాయి. అదే నెలకు రూ.5 వేలు కడితే చేతికి రూ.25 లక్షలు లభిస్తాయి. ఈ స్కీమ్ వలన ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత పూర్తి డబ్బులు తీసుకోవచ్చు.