పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు : మాజీ మంత్రి జూపల్లి

-

మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసు శాఖ దుర్మార్గం గా ప్రవర్తిస్తుందని… ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గం లో పది సంఘటనలు జరిగాయని మండిపడ్డారు. నాగర్ కర్నూలు ఎస్పీ ఎందుకు పనికి రాని వ్యక్తి అని నిప్పులు చెరిగారుమాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. దుర్మార్గం గా జరుగుతుంటే గమనించాలని… కానీ పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంట్లో నుండి నాగర్ కర్నూలు ఎస్పీ బయటకు రాడని మండిపడ్డారు.

పబ్లిక్ గా మొదటి సారి తాను మాట్లాడుతూ ఉన్నానని పేర్కొన్నారు జూపల్లి కృష్ణారావు. రేపు టైం వస్తే వంద శాతం ప్రజాస్వామ్య పద్దతు లలో నిలదీస్తామని.. తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు. పైరవి కారురాలను, దోపిడీ చేసే వాళ్ల ను పోలీసులు గౌరవిస్తున్నారని మండిపడ్డారు. అమానుషం గా అవమానకరంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యనికి ఉన్న బలానికి ఉన్న శక్తి నాయకులు … అది అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు జూపల్లి కృష్ణారావు.

Read more RELATED
Recommended to you

Latest news