హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పై టీఆర్ఎస్ మరో ఆలోచన చేస్తుందా

-

తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అవుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకచోట క్లారిటీతో ఉన్న టీఆర్‌ఎస్‌.. రెండోచోట మాత్రం కన్ఫ్యూజన్ లో ఉంది. అభ్యర్థిని తేల్చడం లేదు..అసలు సొంత అభ్యర్థి బరిలో ఉంటారా లేక మరో ఆలోచనలో ఉన్నారా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ది పై టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చ నడుస్తుంది.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ని టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించింది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు కూడా. కానీ మరో ఎమ్మెల్సీ అభ్యర్ది పై మాత్రం సైలెంట్ మోడ్ లో ఉంది గులాబీ దళం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెద్దఎత్తున గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. అభ్యర్ది విషయంలో పార్టీ వ్యూహం ఏంటో తెలియడం లేదు.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఏదైనా వేరే ఆలోచన ఉన్నదా అన్న చర్చ ఇప్పడు జరుగుతుంది. షెడ్యూల్ విడుదలైంది కాబట్టి.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే.. ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉందట.

గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేశారు. అయినా సక్సెస్‌ కాలేదు. మరి.. ఆ పాత అనుభవాలు వెంటాడుతున్నాయో ఏమో అధికార పార్టీ నుంచి చప్పుడు లేదు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి కదన రంగంలోకి దిగిపోయాయి. ఓటర్ల నమోదు నుంచి ఎత్తులు, వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకే అధికార పార్టీ సైలెన్సే నేతలకు అర్థం కావడం లేదట.

Read more RELATED
Recommended to you

Latest news