ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పార్టీ ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడుతుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఆ పార్టీ రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సహా కొందరు పార్టీ మారడానికి కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం విషయంలో అసహనంగా ఉన్న ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారడానికి ఆసక్తి చూపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో మాజీ ఎంపీ అధిష్టానానికి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆయన పార్టీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి. ఇప్పుడు ఆయన అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన మాటకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు అనే భావనలో ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా సరే ఆయనకు అండగా నిలవడం లేదు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను ప్రభుత్వం సీజ్ చేస్తే న్యాయ పోరాటానికి చంద్రబాబు నుంచి సహకారం అనేది దాదాపు గా లేదు.
దీనితో జేసి ఇప్పుడు పార్టీ మారడానికి సిద్దమయ్యారు. జిల్లా నేతలు కూడా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదు అనే భావనలో ఆయన ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడానికి జేసి సిద్దమయ్యారు. ఇప్పటికే తన అభిమానులు, అనుచరులతో ఆయన సంప్రదింపులు జరిపారు. దానికి వాళ్ళు కూడా ఓకే చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గితే జగన్ కి జై కొట్టే అవకాశాలు కనపడుతున్నాయి.