జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ ఎన్నో పథకాల్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ లో డబ్బులు పెడితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది రాదు. ప్రతీ నెలా కూడా డబ్బులు వస్తాయి. రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదయాన్ని పొందాలంటే కూడా ఎల్‌ఐసీ పధకాలు లో డబ్బులు పెట్టచ్చు. ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ తాజాగా ఓ కొత్త స్కీమ్ ని తెచ్చింది. న్యూ జీవన్ శాంతి పేరుతో ఓ పథకాన్ని అందిస్తున్నారు.
రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదయాన్ని పొందేందుకు ఈ స్కీమ్ తో అవుతుంది. ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే… జీవన్ శాంతి పథకం ద్వారా రెండు రకాల పెట్టుబడి మార్గాలు లో డబ్బులు పెట్టుకోవచ్చు. అందులో ఒకటి ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్. మరొకటి డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇంటర్మీడియట్ యాన్యుటీ ప్లాన్ ని చూస్తే.. ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రీమియం పే చేసాక పెన్షన్ సౌకర్యం వస్తుంది.
అదే డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్ లో చూస్తే.. 1, 5, 10, 12 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది. అర్థ వార్షిక, త్రైమాసిక, నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్ లో మీరు రూ. 1.50 లక్షలు పెట్టుబడి కింద పెట్టాల్సి వుంది. ఎంతైనా పెట్టచ్చు లిమిట్ ఏమి లేదు. ఇందులో డబ్బులు పెట్టడానికి కనీస వయసు 30, గరిష్ట వయసు 79. లోన్ ఫెసిలిటీ కూడా వుంది.
మీరు ఈ జీవన్ శాంతి ప్లాన్ లో సింగిల్, జాయింట్ పాలసీని తీసుకోవచ్చు. ఏది అనేది మీ ఇష్టం. పాలసీదారు మరణిస్తే డిపాజిట్ మొత్తం నామినీకి అందజేస్తారు. ఉమ్మడి పాలసీలో పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ మరొకరికి ఇస్తారు. ఇద్దరూ చనిపోతే నామినీకి అందిస్తారు. 45 ఏళ్ళ వాళ్ళు డిఫర్డ్ యాన్యుటీ లో 12 సంవత్సరాల వ్యవధికి రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే పాలసీదారుడు కి ప్రతీ సంవత్సరం రూ. 1,20,700 వస్తాయి. అంటే నెలకు రూ. 9,656 మీరు పెన్షన్ గా పొందొచ్చు.