జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఇఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. గోదావరి నది పై గూడెం, మోదీకుంట ప్రాజెక్టుల డిపిఆర్ లు, సీడ్ మని, టెలీమెట్రి, బోర్డ్ ఉద్యోగులు తదితర అంశాలపై చర్చ జరగనుంది.
ఈ సమావేశంపై ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ రోజు గోదావరి బోర్డు మీటింగ్ లో పలు అంశాలపై చర్చ చేయనున్నాం. ప్రాజెక్టుల డీపీఆర్ లు స్టడీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ తో ఇంటర్ స్టేట్ వివాదాలు మాకు ఉన్నాయి.వాటిని సీడబ్ల్యూసీ పరిశీలిస్తుంది.మన ప్రాజెక్టులకు ఏపి అంగీకరించదు. సహజంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మోదికుంట వాగు, గూడెం ప్రాజెక్టుల డీపీఆర్ లు రెండు చర్చకు వస్తాయి. టెక్నికల్ క్లియరెన్స్ వచ్చినా.. ఏపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.
ఈ రోజు మీటింగ్ లో క్లియర్ వస్తుందని భావిస్తున్నాం. గోదావరిలో తెలంగాణకు 900 టీఎంసీల వాటా అని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ.. 3 వేల టీఎంసీల ఎక్సెస్ నీరు ఉంది. ప్రాజెక్టు లకు త్వరితగతిన కేంద్రం అనుమతి ఇస్తే ప్రాజెక్టు ల ఖర్చు పెరగదు. తొందరగా క్లియరెన్స్ ఇస్తే పూర్తి చేస్తాం. శ్రీశైలంలో టెలిమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలని మేము చెప్పాము. పోలవరం బ్యాక్ వాటర్ సమస్య మాత్రమే కాదు.. పోలవరం మీద కొత్త ప్రాజెక్టు లు ఏర్పాటు చేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. ఉన్న స్కీమ్ లకు డిస్టబ్ చేయకుండా.. క్లియరెన్స్ ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని అన్నారు.