ఒక్కొక్క సారి మనకి శారీరికంగా సమస్యలు వస్తాయి. ఇంకో సారి మానసికంగా సమస్యలు వస్తాయి. నిజానికి శారీరకంగా తగిలిన దెబ్బ అయినా మానసికంగా తగిలిన దెబ్బ అయినా మానడానికి కాస్త సమయం పడుతుంది. పదే పదే మనకి దాని మీదే దృష్టి ఉండడం వలన చాలా పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. ఎంతో బాధ ఉంటుంది. ఆ తప్పు చేసి ఉండకపోతే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది.
అయితే ఒంటికి తగిలిన గాయమైనా మనసుకి తగిలిన గాయమైన మానడానికి సమయం పడుతుంది. అయితే ఈ దెబ్బలు మానడానికి మనము ధ్యాస వాటి నుండి మళ్ళించాలి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా మనకి రిలీఫ్ పొందడానికి అవుతుంది. శరీరానికి తగిలిన గాయాన్ని పదే పదే ముట్టుకోవడం మనసుకు తగిలిన గాయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం వలన అవి త్వరగా పోవు సరి కదా ఇంకా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి వీలైనంత వరకు దానికి దూరంగా ఉండటమే మంచిది. ప్రతి ఒక్క మనిషికి జీవితం లో ఇవి సహజం అని మీరు వాటిని లైట్ తీసుకోండి అంతే కానీ ఎప్పుడు చూసినా వాటిని తలుచుకుంటూ ఉంటే మరింత బాధ అనిపిస్తూ ఉంటుంది. జరిగిపోయినది మనం ఎలానో మార్చలేము కాబట్టి జరగాల్సింది ఆటోమేటిక్ గా అదే జరిగిపోతుందని భావించి మీ ధ్యాస ని మళ్లించుకుని ఆనందంగా ఉండేందుకు చూసుకోండి అప్పుడే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండొచ్చు.