పంత్ యాక్సిడెంట్​పై సీఎం Vs జాతీయ రహదారుల శాఖ

-

టీమ్‌ ఇండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ రోడ్డు యాక్సిడెంట్​పై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి చేసిన వ్యాఖ్యలకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి వాఖ్యలపై జాతీయ రహదారుల శాఖ రూర్కీ డివిజన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రదీప్‌ సింగ్‌ గుసైన్‌ పీటీఐ వద్ద స్పందించారు. ‘‘పంత్‌ ప్రమాదానికి గురైన ఆ మార్గంలో ఎటువంటి గుంతలు లేవు. కారు ప్రమాదానికి గురైన చోట రాజ్‌వాహ్‌ నది ఉండటంతో రోడ్డు కొంచెం ఇరుగ్గా ఉంది’’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గుంతకు మరమ్మతులు చేసి పూడ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

ఇటీవల ధామి దెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో పంత్‌ను పరామర్శించారు. కారు జాతీయ రహదారిపై ఓ గుంతో లేక నల్లటి వస్తువునో తప్పించబోయి అదుపు తప్పి ప్రమాదానికి గురైందని పంత్‌ పేర్కొన్నట్లు మీడియాకు ధామి తెలిపారు. మరోవైపు పంత్​ను పరామర్శించిన డీడీసీఏ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మా కూడా ప్రమాదానికి కారణం రోడ్డుపై గుంతే అని పేర్కొన్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై హరిద్వార్‌ రూరల్‌ ఎస్పీ ఎస్‌కె సింగ్‌ మాత్రం భిన్నంగా స్పందించారు.‘‘ప్రమాదం జరిగిన నార్సాన్‌ ప్రాంతానికి కిలోమీటరు ముందు పంత్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news