పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్.. కోవిన్ యాప్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

-

దేశంలో 15 నుంచి 18ఏండ్ల మధ్య గల బాలబాలికలకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కోవిన్ యాప్‌లను రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. జవవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

2020, జనవరి 3 నుంచి దేశంలో 15 నుంచి 18ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని డిసెంబర్ 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం, కోవిన్ యాప్‌లో భారత్ బయోటెక్‌కు చెందిన కొవ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సూచిస్తున్నది. 12 ఏండ్ల పైబడిన పిల్లలకు అత్యవసర వినియోగం కోసం కోవ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జైడూస్ క్యాడిళ్లకు చెందిన జైకోవ్-డి వ్యాక్సిన్ కూడా అనుమతి పొందినా మొదట 18ఏండ్ల పైబడిన వారికి మాత్రమే ఇవ్వనున్నారు.

15ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య పిల్లలు కుటుంబ సభ్యులతోపాటు కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా విడిగా కూడా చేసుకొనే అవకాశం కల్పించారు.

ఆధార్ కార్డ్ లేని పిల్లలు తమ స్కూల్ ఐడీ కార్డు ద్వారా కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఒక్క మొబైల్ ఫోన్‌తో కుటుంబంలో నలుగురి పేర్లను నమోదు చేయవచ్చు.

పిల్లలు టీకా కోసం సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి కూడా వెళ్లవచ్చు. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.

కొంత మంది కోవిన్ యాప్‌పై కూడా విమర్శలు గుప్పించారు. కానీ, చివరికి కోవిన్ యాప్‌ గెలిచింది అని కోవిన్ యాప్ చీఫ్ ఆర్ ఎస్ శర్మ్ తెలిపారు. కోవిన్ యాప్ భారతదేశ జాతీయ ఆరోగ్య గుర్తింపునకు వేదికగా మారిందని పేర్కొన్నారు. కొవిడ్ టీకాల పంపిణీ కోసం కోవిన్ యాప్ ఉపయోగించాలనుకొనే ఇతర దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news