ఏపీలో ఒమిక్రాన్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం వైయస్.జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగలలోని ఆస్పత్రులుకూడా దీనికి సిద్ధంగా ఉండాలన్న సీఎం.. వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలన్న సీఎం.. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ పై భయాందోళన అవసరంలేదని.. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని.. డేటాను పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్ సర్వే తప్పనిసరిగా జరగాలని..టెస్ట్ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతిలలో పోవాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలని.. సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని వెల్లడించారు.