ఏప్రిల్ మాసం వచ్చేస్తోంది. మరో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. ఏప్రిల్ నెలలో చాలా రోజుల పాటు బ్యాంకులు మూసివేసే ఉంటాయి. ఈ ఏడాదిలో ఏప్రిల్‌లో ఎన్నిరోజులు బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసా..?
ఏప్రిల్ మాసంలో వారాంతాలతో సహా మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 1 (ఆర్థిక వార్షిక సంవత్సరం), 2 (ఆదివారం), 4 (మహవీర్ జయంతి), 5 (జగ్జీవన్‌రాం జయంతి), 7 (గుడ్‌ఫ్రైడే), 8 (రెండో శనివారం), 9 (ఆదివారం), 14 (అంబేడ్కర్ జయంతి), 15 (బెంగాలీల న్యూ ఇయర్), 16 (ఆదివారం), 18 (షాద్ ఈ ఖాదర్), 21 (ఈద్ ఉల్ ఫితర్), 22 (రంజాన్), 23 (ఆదివారం), 30 (ఆదివారం) తేదీల్లో బ్యాంకుకు సెలవు దినంగా ఉంది.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక రోజులు (పండగలు/రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు) ఉండడం వల్ల ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు కొన్ని సెలవులు ఉంటాయని గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 11 రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి.