ఎడిట్ నోట్: ఎవరి స్క్రిప్ట్ వారిది!

-

ఏపీ రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి..ఎవరి స్క్రిప్ట్ వారిది..అటు వైసీపీ, ఇటు టి‌డి‌పిల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాల్లో వైసీపీ గెలిచినా..ఒక స్థానంలో టి‌డి‌పి గెలవడంపైనే చర్చ సాగుతుంది. ఎందుకంటే టి‌డి‌పికి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. అదే సమయంలో నలుగురు టి‌డి‌పి ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేశారు. ఒక జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీకి వేశారు.

కానీ కేవలం నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల గురించే చర్చ సాగుతుంది..అలా క్రాస్ ఓటింగ్ చేసిన వారిని వైసీపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే తమ ఎమ్మెల్యేలని చంద్రబాబు డబ్బులు పెట్టి కొన్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అదే సమయంలో తమకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ 23 ఓట్లే తమకు పడ్డాయని, అది దేవుడు స్క్రిప్ట్ అని టి‌డి‌పి అంటుంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని క్రాస్ ఓటు చేశారని అంటున్నారు..అలాంటప్పుడు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఎంత తీసుకుని వైసీపీ వైపుకు వెళ్లారని టి‌డి‌పి ప్రశ్నిస్తుంది.

అయితే ఇది ఓటుకు నోటు 2.0 అని చెప్పి వైసీపీ అంటుంది. తమ ఎమ్మెల్యేలని డబ్బులు పెట్టే కొన్నారని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే..ఎవరైతే..టి‌డి‌పి, జనసేనల నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లారో..వారు సైతం టి‌డి‌పి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలని కొన్నదని ఆరోపించడం..అలాగే తమకు ఆఫర్ ఇచ్చారని చెప్పడం. వారే జంపింగ్ చేశారు..మళ్ళీ వారికి డబ్బులు ఆఫర్ అంటా.

పైగా డబ్బులు ఆఫర్ ఇస్తే ఎన్నికల ముందే బయటపెట్టవచ్చు..ఎన్నికల అయ్యేవరకు ఎందుకు ఆగారు? ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటే..అదో స్క్రిప్ట్ అని అర్ధమవుతుంది. ఇటు టి‌డి‌పి సైతం నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని లాగేసిందని అర్ధమవుతుంది. అంటే రెండు పార్టీలకు స్క్రిప్ట్ ఉంది..మరి వీటిలో జనం ఎవరి స్క్రిప్ట్ నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news