ఇరాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తబాస్ సమీపంలో బుధవారం ప్యాసింజర్ రైలు పట్టాలు అదుపు తప్పింది. రైలు భోగిలు బోల్తా పడ్డాయి. ఘటనలో 17 మంది మృతి చెందగా.. దాదాపు 50 మందికిపైగా తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టెహ్రాన్‌కు 550 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలులో 350 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
రైలులోని ఏడు కోచ్‌లలో నాలుగు భోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి మూడు హెలికాప్టర్లు, వైద్య సిబ్బంది చేరుకున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో కమ్యూనికేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. టబాస్ నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ట్రాక్ యాజ్డ్ సెంట్రల్ సిటీకి ట్రైన్ పట్టాలు కలుపుతుంది. అయితే ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.