‘రెడ్డి గారు’ ఈ సారి ఊర మాస్..బాలయ్య NBK107 టైటిల్ ఫిక్స్!

-

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. NBK107 టీమ్ నుంచి ఇటీవల మాస్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అది చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మాస్ అవతార్ లో అదరగొడతారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

ఈ చిత్ర టైటిల్ గురించి గత కొద్ది రోజుల నుంచి ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ‘జై బాలయ్య’, ‘అన్న గారు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ పిక్చర్ కు ‘రెడ్డి గారు’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తుండగా, శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్ డేట్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news