ఈ స్కీమ్ తో.. ప్రతి నెలా రూ.18,500…!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది వాళ్లకి నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి వయ వందన యోజన కూడా ఒకటి. ఇక పూర్తి వివరాలని చూస్తే.. వయ వందన యోజన లో చేరితే చాలా లాభాలు ఉంటాయి. కానీ ఇందులో చేరేందుకు గడువు త్వరలో ముగిసిపోనుంది.

2023 మార్చి 31 వరకే దీనిలో చేరేందుకు ఛాన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. కేవలం 60 ఏళ్ల వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు 7.4 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఈ స్కీమ్ లో రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చెయ్యచ్చు. రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే 7.4 శాతం రేటు ప్రకారం ఏడాదికి రూ. 1.1 లక్షల వడ్డీ ఆదాయం వస్తుంది. ప్రతి ఏటా మీకు రూ. 1.1 లక్షలు వస్తాయ్. కనీసం రూ. 1,56,658 డిపాజిట్ చెయ్యాలి.

ఇందులో చేరడం వల్ల కనీసం నెలకు రూ. 1,000 పెన్షన్ ని మీరు పొందొచ్చు. ఏడాదికి రూ. 12 వేలు వస్తాయి. గరిష్టంగా మీరు నెలకు రూ. 9,250 పెన్షన్ ని పొందొచ్చు. ఏడాదికి రూ. 1.1 లక్షలు వస్తాయి. పెన్షన్ మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున మీరు పొందవచ్చు. ఈ స్కీమ్ లో సింగల్ గానే కాకుండా భార్యా భర్తలు ఇద్దరూ కూడా పెట్టచ్చు. భార్యా భర్తలు ఇద్దరూ ఈ పథకం లో చేరి రూ. 15 లక్షల పెడితే.. రూ. 15 లక్షల చొప్పున అంటే రూ. 30 లక్షలు డిపాజిట్ చేస్తే… సంవత్సరానికి రూ. 2,22,000 వడ్డీ పొందొచ్చు. నెలకు దాదాపు రూ. 18,500 మీకు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news