సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందంగానే ఉన్నారు – రఘురామ

-

తమ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు ఆనందంగానే ఉన్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని, పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత మేకపాటి గారు మాట్లాడుతూ ఇకపై నుంచి తనకు ఐప్యాక్ గొడవ ఉండదని పేర్కొనడం పరిశీలిస్తే, పార్టీ నుంచి సస్పెండ్ అయినందుకు ఎంత ఆనందంగా ఉన్నారో ఇట్టే అర్థం అవుతుందని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లను ఓటు వేయమని అడగలేదని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డే గారే చెప్పారని, ఓటు వేయమని అడగనప్పుడు చర్యలు తీసుకునే అధికారం ఎక్కడిది? అని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేయడానికి వీలు లేదని, పార్టీకి ఆ అధికారం ఉండదని, పార్టీ విప్ ను ఎమ్మెల్యే లు ఉల్లంగించారని ఎలా నిర్ధారిస్తారని అన్నారు. ఏ బి డి ఎఫ్ అని కోడ్ ఇచ్చామని చెప్పే హక్కు పార్టీకి లేదని, ఇది ఎన్నికల నిబంధనకుపూర్తి విరుద్ధమని, ఇది అనాగరిక చర్య అని, ఇదే విషయాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురి అయిన శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే తమ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దవుతుందని అన్నారు. ఎన్నికల్లో పార్టీ విప్ ఉల్లంగించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ సభ్యులను నలుగురిని ఎందుకు సస్పెండ్ చేయలేదంటే, ఇది సహేతుకమైన కారణం కాదని ఆయనకు తెలుసునని అందుకే పార్టీ విప్ ను ధిక్కరించి ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

 

పార్టీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి అనుకుంటే, ముందు వారికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, షోకాజ్ నోటీసుకు వారు సమాధానం ఇచ్చిన తర్వాత, వారి సమాధానం నచ్చకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చునని అన్నారు. ఏ ప్రాతిపదికన తమని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇది రాజకీయ పార్టీయేనా, పార్టీలో సభ్యులకు ప్రాథమిక హక్కులు ఉండవా? అని నలుగురు ఎమ్మెల్యేలు కనుక ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అందులో ఎటువంటి సందేహం లేదని, ఇది కేవలం ఆవేశంతో చేసిన హత్య వంటిదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news