డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డీ (2-డీజీ) వ్యాక్సిన్ మొదటి బ్యాచ్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్‌ను విడుదల చేయనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను డీఆర్‌డీఓ.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్‌ఎంఏఎస్), డాక్టర్ రెడ్డీస్ ప్రయోగశాలల ఆధ్వర్యంలో అభివృద్ధి చేసింది. అయితే గత శుక్రవారం 2-డీజీ వ్యాక్సిన్‌కు సంబంధించిన 10,000 మోతాదుకు చెందిన మొదటి బ్యాచ్‌ను ప్రారంభిస్తామని డీఆర్‌డీఓ అధికారులు ప్రకటించారు.
ఈ 2-డీజీ వ్యాక్సిన్ కరోనా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింతగా పెంచడానికి కృషి చేయనున్నట్లు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందం, డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. ఈ మేరకు 2-డీజీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుందన్నారు. ఇందులో కరోనా బాధితులు తొందరగా క్యూర్ అవడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు. 2-డీజీ వ్యాక్సిన్ తీసుకున్న బాధితుల్లో ఆర్‌టీ-పీసీఆర్ ప్రతికూల మార్పిడి చూపిందన్నారు. కరోనాతో బాధపడుతున్నవారికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు.
గతేడాది కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజలందరూ సంసిద్ధం అవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు డీఆర్‌డీఓ 2020 ఏప్రిల్‌లో 2-డీజీ వ్యాక్సిన్‌ను ఐఎన్ఎంఏఎస్‌తో కలిసి హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో ప్రయోగాలు జరిపారు. ఈ వ్యాక్సిన్ సార్స్-కోవ్-2 వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితాల ఆధారంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ).. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కరోనా బాధితులకు 2-డీజీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదం తెలిపింది.