బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో 2 కోట్ల మందికి కరోనా..!

-

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అదిగో వ్యాక్సిన్.. ఇదిగో వ్యాక్సిన్ అని చెప్తున్నారే తప్ప.. ఇంతవరకు ఎలాంటి వ్యాక్సిన్ వచ్చింది లేదు. దీంతో మాస్క్, సానిటైజర్ మనుషుల జీవితంలో ఒక భాగమైపోయాయి. ముఖ్యంగా దీని ప్రభావం అగ్ర రాజ్యమైన అమెరికా మీద ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అమెరికాలో దాదాపు 2 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ దేశపు వైద్యాధికారులు.

కరోనా పూర్తిగా కట్టడి కాకముందే లాక్ డౌన్ ఎత్తివేయడంతో అక్కడ వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. లక్షలాది మంది వారికి తెలియకుండానే వైరస్ బారిన పడుతున్నారని, టెస్టింగ్స్ ఇబ్బందుల వల్ల వీరంతా లెక్కలోకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా 20 మిలియన్ల మందికి కరోనా సోకిందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది దీని బారిన పడగా.. కొన్ని లక్షల మంది మరణించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news