మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన నిందితుడు శ్రీనివాస్‌ తన ఇంటి దగ్గర ఉండే కూతురు వరసయ్యే బాలికను డిసెంబర్‌7, 2015న ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరాన్ని బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సాక్షాధారాలను పరీశీలించిన న్యాయస్థానం.. నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Shahjahanpur: Girl raped at minor age files case after 27 years - Crime News

ఇదిలా ఉంటే మరో కేసులో.. మైనర్‌ బాలిక (16)ను పెళ్లి చేసుకోవాలని వేధించిన స్కూల్‌ డ్రైవర్‌ హర్షవర్ధన్‌కు మూడేండ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. 10వ తరగతి చదువుతున్న బాలికను స్కూల్‌ డ్రైవర్‌ పెళ్లి చేసుకోవాలని వేధించాడు. లేకుంటే చంపుతానని బెదిరించడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హర్షవర్ధన్‌ను అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సాక్షాధారాలను పరీశీలించిన నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.