‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

-

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్‌ అనూ, శిరీష్ మ‌ధ్య ఫ‌న్‌, సీరియ‌స్‌, రొమాంటిక్ ట్రాక్‌తో సినిమా సాగ‌నున్న‌ట్టు తెలిసిపోతుంది. రాకేశ్ శ‌శి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, సునీల్‌, ఆమ‌ని, కేదార్ శంక‌ర్ కీ రోల్స్ పోషిస్తున్నారు.ధీర‌జ్ మొగిలినేని-విజ‌య్ ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచు జ‌మ‌ని-అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 4న విడుద‌ల కానుంది.

Allu Sirish and Anu Emmanuel's romantic drama titled 'Prema Kadanta' | The  News Minute

ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఒకే ఆఫీసులో పనిచేసే హీరోహీరోయిన్లు, ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే హీరోయిన్‌తో రిలేషన్‌లోకి వెళ్తాడు హీరో. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం కేవలం ఫ్రెండ్స్ గానే ఉందామని హీరోతో చెబుతోంది. ఈ ట్విస్టుతో హీరో ఏం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో శిరీష్ రిఫ్రెషింగ్ లుక్‌తో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు. అటు హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో ఎక్కువశాతం లిప్‌లాక్ సీన్స్, రొమాన్స్‌నే నింపేశారు చిత్ర యూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news