2021 తానా మహాసభలకి డేట్ ఫిక్స్ ..!!!

-

అమెరికాలో ఉన్న భారతీయులలో అత్యధిక శాతం మంది తెలుగువారే ఉంటారు.  మన తెలుగు వారికోసం అక్కడ ఏర్పాడ్డ సంఘాలు కూడా ఎక్కువే. అయితే అందరికి అందుబాటులో ఉంటూ తెలుగు వెలుగులని పంచుతూ తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని బ్రతికిస్తున్న ఏకైక సంస్థ ఉతర అమెరికా తెలుగు సంఘం తానా. అమెరికాలో ఎన్నో స్వచ్చందం తెలుగు సంస్థలు ఉన్నా తానాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.

తానా నిర్వహించే ఎటువంటి కార్యక్రమం అయినా సరే అంబరాన్ని తాకేలా ఏర్పాటు చేస్తారు.తెలుగు పండుగలు, పూజలు, వ్రతాలు, హోమాలు..స్వచ్చంద సేవా కార్యక్రమాలు, ఫుడ్ డ్రైవ్ ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలని చేపడుతూ తెలుగువారందరినీ ఒకేచోట చేర్చుతుంది తానా. అయితే తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా నిర్వహించే తానా మహాసభలకి డేట్ ఫిక్స్ చేశారు తానా అధ్యక్షులు తాళ్ళూరి.

 

23వ ద్వైవార్షిక మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా లో గల కన్వెన్షన్ సెంటెర్ నందు 2021 జులై 2,3,4 తేదీలలో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. నిన్నటి రోజున జరిగిన కార్యవర్గ సమావేశంలో మహాసభల నిర్ణయం తీసుకున్నట్లుగా తాళ్ళూరి ప్రకటించారు. ఈ సభలని నిర్వహించేందుకు సమన్వయ కర్తగా పొట్లూరి రవిని నియమించారు. తానా స్థాయికి  ఏ మాత్రం తగ్గకుండా ఈ సభలని నిర్వహిస్తామని పొట్లూరి రవి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news