2024 ఎన్నికలు: ఏపీలో BRS పోటీపై కేటీఆర్ క్లారిటీ…

-

కేటీఆర్ నిన్న ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో BRS పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లనున్నామో అన్న విషయాన్ని చెప్పారు. అందులో భాగంగా పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ చెబుతూ… ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తామా లేదా అన్న విషయం త్వరలోనే తెలియచేస్తాము. అయితే ఏపీలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయడం వలన ఉపయోగం ఉంటుందని ఎన్ను అనుకోవడం లేదన్నారు కేటీఆర్. అందుకే ఏపీలో కేవలం ఎంపీ స్థానాలకు మాత్రమే BRS పార్టీ పోటీ చేయడానికి ప్రణాలికలు రచిస్తున్నామని స్పష్టంగా తెలియచేశారు. మేము అల్టిమేట్ గా ఢిల్లీలో ఒక కీలక పాత్ర పోషించడానికి మాత్రమే జాతీయ రాజకీయాలు అన్న అజెండాను ఏర్పరుచుకున్నాము.

అందుకే దేశ వ్యాప్తంగా వీలైనన్ని ఎంపీ స్థానాలను గెలుచుకుని మోదీ భరతం పట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news