కేంద్రం నుండి ఒక్కో రైతుకు ఎకరానికి రూ.24 వేలు…!

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో సాయం చేస్తోంది. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. రైతులని అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలానే పెరుగుతున్న ఎరువుల ఖర్చుల భారం రైతుల కి పడకూడదని కేంద్రమే చూసుకుంటోంది. పండించిన పంటకు గిట్టుబాటు వచ్చేలా మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

farmers

బీజేపీ వచ్చిన తరవాత ఈ తొమ్మిదేళ్ల లో కనీస మద్దతు ధర 60-80 శాతానికి పెంచినట్లు చెప్పారు. తెలంగాణ రైతులకు ఒక్క ఏడాది లోనే ఎరువుల పై రూ.27 వేల కోట్ల సబ్సిడీని కేంద్రం ఇచ్చిందన్నారు. పీఎం కిసాన్‌, ఎరువుల సబ్సిడీ రెండూ కలిపి ఎకరాకు రూ.24 వేల మేర కేంద్రం ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం రాక ముందు అయితే విపరీతమైన ఎరువుల కొరత వుంది అని కిషన్ రెడ్డి చెప్పారు.

భారత్ బ్రాండ్ పేరుతో యూరియా ప్రవేశపెట్టబోతున్నామని యూరియా వాడకం పరిమాణాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్రం చూస్తోందన్నారు. దీని కోసమే దేశవ్యాప్తంగా 8 ప్లాంట్లు సిద్ధం అవుతున్నాయన్నారు. అలానే తెలంగాణ లో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఇది వరకు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు ఇస్తోందన్నారు. అంతే కాదు రూ.33 కిలో బియ్యంను ఉచితంగా 84 కోట్ల పేదలకు కేంద్రం ఇస్తున్నట్టు చెప్పారు. పంట నష్టం కూడా బాగా తగ్గిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news