పోస్ట్ ఆఫీస్ నుండి అదిరే స్కీమ్.. రూ.250 తో రూ.25 లక్షల బెనిఫిట్…!

-

ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ని ప్రవేశపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో సుకన్య సమృద్ధి అకౌంట్ ని ఓపెన్ చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది. మొత్తం 7.5 లక్షల ఖాతాలను తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసమే ఈ మేళా ని నిర్వహించనునట్లు చెప్పారు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. ప్రస్తుతం 7.6 శాతం చక్రవడ్డీ ని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఇస్తున్నారు.

ఈ అకౌంట్ ని ఓపెన్ చేసేందుకు పోస్టాఫీసుల్లో కేవలం రూ.250తో ఖాతా ని ఓపెన్ చెయ్యచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు పొందవవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసేయచ్చు. ఉద్యోగం చేసే వారికి ఈ స్కీమ్ బాగుంటుంది.

ఈ స్కీమ్ లో చేరాలంటే తల్లి లేదా తండ్రి పాన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటుగా రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, పాప బర్త్ సర్టిఫికెట్ ని తీసుకు వెళ్లాల్సి వుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్ లైన్ లో నగదు జమ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చెయ్యచ్చు. నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు.

నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా వస్తాయి. ఈ స్కీమ్ అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక డబ్బులని విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్ కింద వచ్చే వడ్డీ మారుతూ ఉండచ్చు. పెరగొచ్చు తగ్గచ్చు లేదా నిలకడగానే ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news