సాగర్‌లో 26 గేట్ల ఎత్తివేత!

-

రాష్ట్రంలో అతిపెద్ద బహుళార్థకసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌లో అన్ని గేట్లు (26) ఎత్తి దిగువ పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో అధికారులు 26 గేట్లను పైకెత్తారు.

ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 230.52 టీఎంసీల నీరునిల్వ ఉంది. సాగర్ నుంచి వరద జోరు కొనసాగితే ఇవాళ లేదా రేపటికి పులిచింతల నిండే అవకాశముంది. 2009 లో 510 లో ఉండగా సెప్టెంబర్ లో వరద వస్తే,ఇప్పుడు ఆగస్ట్ మొదటి వారంలోనే వచ్చింది.

కృష్ణా పరివాహక ప్రాంతాంలో భారీ వర్షాలు!!
ఒక్కసారిగా పశ్చిక కనుమల్లోని మహాబలేశ్వర్‌లో కురిసిన భారీవానలకుతోడు కర్ణాటకలోనూ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. దీనితో ఒక వారం రోజులలో సీన్ మారిపోయింది. మహారాష్ట్రలో కోయినా పవర్ డ్యామ్ దిగువున ఆల్మట్టి 129 టీఎంసీలు, నారాయణపూర్ 37.64, జూరాల 9.66, శ్రీశైలం 215, నిండి పోయి సాగర్ డ్యామ్ జల హోరుతో తరలి వస్తోంది. మూడు రోజుల్లోనే 60 టీఎంసీల వరద చేరింది. రోజుకు 24 గంటలు 60 టీఎంసీ ల వంతున వస్తే మరో రెండు రోజుల్లో నిండి పోయే అవకాశాలు
మెండుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news