గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న స్వ‌ల్పంగా పెరిగిన‌ బంగారం ధ‌ర ఈ రోజు త‌గ్గుముఖం ప‌ట్టింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు తగ్గి 39,390 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయలు తగ్గి 36,110 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 150 రూపాయలు తగ్గి 46,150 రూపాయలుగా స్థిరంగా ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 38,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 36,850 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 150 రూపాయలు తగ్గి 46,150 రూపాయలతో స్థిరంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news