నిరుద్యోగులకు మరో శుభవార్త..త్వరలోనే మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. ప్లలె దవాఖానాలు, పీహెచ్ సీలు, బస్తీ దవాఖానాల్లో పని చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించారు.పల్లె ధవాఖాన ,బస్తి ధవాఖానలో ,పిహెచ్ సి లు పని చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. పేదలకు సేవ చేసే అదృష్టం కలుగుతుందని మంత్రి హరీష్ రావు కోరారు.
ఈ ఆస్పత్రుల్లో పని చేసే వారికి ఈ అకాడమిక్ లోనే 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ప్రయివేటు, ప్రభుత్వ కళాశాల్లో రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాం. 200 డాక్టర్లు ఈ సంవత్సరం పీజీ లో జాయిన్ అయ్యారని వివరించారు. ప్రభుత్వ ధవాఖానలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పీజీ సీట్స్ కూడా పెంచినం, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు ప్రభుత్వ రంగంలో 570 పీజీ సీట్లు ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుండి పీజీ సీట్ల సంఖ్య 1212కు పెంచనున్నం. ఏడేళ్లలో డబుల్ సీట్లు పెంచామని గుర్తు చేశారు మంత్రి హరీశ్ రావు.