ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు సిద్ధూ తన స్నేహితులతో కలిసి కారులో ఇంటి వెళ్తుండగా.. కొందరు అతడి కారును అడ్డుకున్నారు. కారు చుట్టూ 8 నుంచి 10 మంది దిగి సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అతని బాడీలో 30 బుల్లెట్లు దింపారు. అనంతరం చనిపోయినట్లు నిర్ధారించుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సిద్ధూని తామే చంపినట్లు బిష్ణోయ్ సన్నిహితులు గోల్డీబ్రార్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు బిష్ణోయ్‌ను రిమాండ్‌కు తీసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం బిష్ణోయ్ తిహాడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే హత్యకు సంబంధించి జైలు నుంచే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం షారుఖ్ అనే క్రిమినల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఒక మెసేజింగ్ యాప్ ద్వారా గోల్డీబ్రార్‌లో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. కాగా, ప్రస్తుతం బిష్ణోయ్, అతడి అనుచరులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణ జరుపుతున్నట్లు సమాచారం.