టీఆర్ఎస్‌ ప్లీనరీలో 33 రకాల వంటకాలు..

-

ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఈ సారి ప్లీనరీ సమావేశాలను వైభవంగా జరుపుకోనున్నట్లు ఇప్పటికే టీఆర్ఎస్‌ శ్రేణులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ తెలిసింది. అదేటంటే.. టీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి రాష్ట్రంలోని కార్యకర్తలు, గ్రామ స్థాయి నుంచి పట్టణ, నగరస్థాయి నేతలు అందరూ రానున్నారు. అయితే ఈ సమావేశాలకు హజరుకానున్న వారికి ఆతిధ్యంలో 33 రకాల వంటకాలు వడ్డించబోతున్నారు. అయితే.. ఇప్పటికే హైదరాబాద్‌ మహా నగరం టీఆర్ఎస్‌ ప్లీనరీ సమావేశాల కోసం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు.

33 ర‌కాల వెరైటీలు ఇవే..
డబుల్‌కామీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version