ఫ్యాక్ట్ చెక్: ఆడపిల్ల వుందా..? ఈ స్కీమ్ తో నెలకి రూ.4,500..!

-

ఈ రోజుల్లో నకిలీ వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలామంది నకిలీ వార్తలు వలన మోస పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీముల మొదలు ఉద్యోగాల వరకు ఎన్నో ఫేక్ వార్తలు ఉంటాయి. అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల ద్వారా చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ప్రతి నెల బెనిఫిట్స్ ని పొందే స్కీములు కూడా ఉన్నాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ని తీసుకువచ్చిందని.. కన్యా శుమంగళ యోజన స్కీం అని ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లలు ఉన్న ఇంటికి రూ.4500 ప్రతి నెలా వస్తాయని ఒక వార్త వచ్చింది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకువచ్చిందా..? ఈ స్కీం ద్వారా ఆడపిల్లలకి 4500 వస్తాయా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. సర్కారీ వ్లాగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో ఈ నకిలీ వార్త స్ప్రెడ్ చేశారు.

ఇది చూసి చాలా మంది నిజం అని భావిస్తున్నారు అయితే నిజానికి ఈ స్కీమ్ ని మోడీ తీసుకురాలేదు. రూ. 4500 ఆడపిల్లలకి ఇవ్వడం లేదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పేసింది కాబట్టి అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని ఇతరులతో షేర్ చేసుకోకండి మీరు కూడా నిజమని భావించి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news