కరోనా విలయతాండవం చేస్తుంటే… కరోనాను చాలా ఈజీగా తీసుకుంటున్నారు అధికారులు. క్వారంటైన్ జోనుల్లో క్రికెట్ ఆడుతూ ద్యాంసులు చేస్తున్న వార్తలు చూసాము.. క్వారంటైన్ సెంటర్ లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరగడం కూడా గమనించాము.. ఇప్పుడు స్టేట్ హోమ్ లో ఉన్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ రావడం అనేక ప్రశ్నలకు తెర తీసింది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు..? అధికారులకు చిత్త శుద్ధి లేదా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్న పరిస్థితి.
వివరాల్లోకి వెళితే.. యూపీ ప్రభుత్వ షెల్టర్ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి కరోనా సోకిన విషయం బయటపడింది. వీరిలో ఐదుగురు గర్భవతులుగా ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఒకరికి హెచ్‌ఐవి పాజిటివ్ గా తేలింది మరొకరికి హేపీటైటిస్ సి ఉన్నటుగా నిర్ధారణ జరిగింది. అయితే ఆ ఐదుగురు మహిళలకు స్టేట్ హోమ్ లోకి వచ్చిన తరువాత గర్భం వచ్చిందా లేక మునుపే గర్భం ఉందా అనేది పెద్ద ప్రశ్న..! కానీ అధికారులు మాత్రం ఆ మహిళలు అంతా భాదితులేనని అత్యాచారాలకు గురైన వారు లైంగిక దాడులకు గురైన వారికే అక్కడ బసకు ఏర్పాటు చేశాము అని తేల్చి చెబుతున్నారు. స్టేట్ హోం పరిస్థితి మరీ దారుణంగా ఉందని శుభ్రతకి తావు లేదని అక్కడకు వెళ్ళిన మహిళా సంఘాలు చెబుతున్నాయి, వారికి కరోనా ఎలా సోకిందని ఖచ్చితమైన సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వారు మండిపడుతున్నారు.