శృంగారం: పడక మీదే చేసే ఈ పొరపాట్లు వెంటనే మానుకోండి.

పొరపాట్లు మానవ నైజం. పొరపాట్ల నుండే జీవిత విషయాలని నేర్చుకోవాలని అంటారు. కానీ, కొన్ని పొరపాట్లు జీవితాన్ని బలితీసుకునేలా ఉంటాయి. అలాంటి వాటికి ఆమడ దూరంలో ఉండాల్సిందే. ముఖ్యంగా శృంగారం విషయంలో ఇలాంటి పొరపాట్ల గురించి ముందుగానే తెలుసుకోవాలి. ప్రస్తుతం శృంగారంలో చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.

మోసం

మోసం అనగానే మీ ఆలోచనలు ఎటో వెళ్ళి ఉంటాయి. ఇక్కడ మోసం అంటే అవతలి వారికి ఇష్టం ఉన్నప్పుడు మీకు ఇష్టం లేకపోయినా కూడా ఏదో వారి తృప్తి కోసమని చెప్పి తప్పనిసరిగా చేయాల్సిన క్రియగా చేయడం సరైన పనికాదు. దానివల్ల మీ బంధానికే ముప్పు ఏర్పడవచ్చు.

చొరవ చూపకపోవడం

ప్రతీసారీ ఒక్కరే చొరవ తీసుకుని శృంగార కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా ఒక్కోసారి మీరు కూడా స్పందించి చొరవ తీసుకుంటే అవతలి వారికి అదొక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. దాంతో మరింత రెచ్చిపోతారు.

బద్దకం

ఏ విషయంలో బద్దకంగా ఉన్నా ఫర్వాలేదు గాని శృంగారంలో బద్దకం అస్సలు పనికి రాదు. అవతలి వారికి ఎలాంటి అంశాలు నచ్చుతాయో తెలుసుకుని, అవి మీకు సౌకర్యంగా అనిపిస్తే అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం, లేదా మీకు నచ్చిన అంశాలను అవతలి వారికి చెప్పడం మంచిది.

నీకేం కావాలని అడగకపోవడం

గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళడం కాకుండా, అవతలి వారిని అడగడం తెలుసుకోవాలి. ఇరువురి ఇష్టాలు కలుసుకున్నప్పుడు వచ్చే ఆనందం శిఖరాగ్రాన ఉంటుంది.

సురక్షితంగా లేకపోవడం

శృంగారంలో మీరెంత వేడిలో ఉన్నా సురక్షిత శృంగారాన్ని మర్చిపోవద్దు. ఎక్కువ మంది తప్పు చేసేది ఇక్కడే. అక్కడిదాకా వచ్చాం కదా అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తుంటారు. అవే పెను తుఫానులకు కారణంగా నిలుస్తాయి.