6 వేల కోట్లు దారి మళ్లించారు – నాదెండ్ల మనోహర్

-

వైసిపి ప్రభుత్వం ఎస్డిసి ద్వారా తెచ్చిన సుమారు 6 వేల కోట్లను దారి మళ్ళించిందని ఆరోపించారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వం ఆ కార్పోరేషన్ ద్వారా అప్పులు చేస్తోందన్నారు. ఆ రూ. 6 వేల కోట్ల అప్పుల వినియోగం లెక్కలేవి..? అంటూ ప్రశ్నించారు. 2020లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసేస్తానంటూ సీబీఐ దత్త పుత్రుడు ఏపీ అభివృద్ధి కార్పోరేషన్ మొదలు పెట్టారని అన్నారు.

 

ఎస్డీసీ ఏర్పాటు విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. కేంద్రాన్ని మభ్య పెట్టేలా మాజీ సీజేఐ ద్వారా ఎస్డీసీకి చట్టబద్దత ఉందని చెప్పించారని అన్నారు. ఎస్డీసీ రాజ్యాంగానికి విరుద్దం అని కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసిందన్నారు నాదేండ్ల. ఎస్డీసీకి రుణాలివ్వోద్దని బ్యాంకర్లను హెచ్చరించిందన్నారు. కేంద్రం ప్రకటన చేసే నాటికే రూ. 23 వేల కోట్లు ఎస్డీసీ ద్వారా ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. రూ. 23 వేల కోట్లల్లో అమ్మఒడి, చేయూత, ఆసరాకు రూ. 17 వేల కోట్లకు పైగా వాడేశారన్నారు.

మద్యం ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ. 25 వేల కోట్లు ఆదాయం వస్తుందని.. చేసిన అప్పులు.. వస్తోన్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్డీసీని అప్పులకే పరిమితం చేసారని మండిపడ్డారు.
ఏపీలో జరుగుతోన్న ఆర్ధిక అవకతవకలపై కేంద్రం కూడా స్పందించి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మా ఒత్తిడి ఫలించింది.. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నెమ్మదించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news