తెలంగాణ పోలీసు శాఖ‌లో కొన‌సాగుతున్న పోస్టింగ్‌లు, బ‌దిలీలు

-

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా డీఎస్పీలకు ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 67 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఈమేరకు డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుమ్‌పుర ఏసీపీగా జావిడ్‌, మీర్‌చౌక్‌ ఏసీపీగా ఉమామహేశ్వరరావు, సీసీఎస్‌ ఏసీపీగా శంకర్‌రెడ్డి, వరంగల్‌ సీసీఆర్బీ ఏసీపీగా గజ్జి కృష్ణ, టీఎస్‌ జెన్‌కో ఏసీపీగా తిరుపతి యాదవ్‌లను నియమించారు.

TS Police PMT/PET Schedule released @tslprb.in; Check details here - Times  of India

ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖలో సంచలనం చోటుచేసుకుంది. ఒకేసారి 91 మంది ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల బదిలీ కావడం జరిగింది. తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని బదిలీలు ఒకేసారి జరిగిన దాఖలాలు లేవంటే ఆశ్చర్యపడే విషయం ఏమి కాదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news