ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, పట్టింపులేనితనంతోనే వరదలతో నష్టపోయిన పరిస్థితులు నెలకొన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల డిజైనింగ్‌లతోనే ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయన్నారు. మహారాష్ట్ర, ఒడిశాల్లోని నేతల కోసం హెలిక్యాప్టర్లు పంపించే కేసీఆర్‌కు…. విపత్తులో ఉన్న రాష్ట్ర ప్రజలను కాపాడలేకపోయారన్నారు.
అడ్డగోలుగా చెక్ డ్యాములు కట్టడం వల్లే ఇంతటి ప్రమాదం వచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అనాలోచిత డిజైన్ల వల్ల ప్రజలు వరదల్లో మునిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఒక హెలికాప్టర్ అడిగితే స్పందించరు కానీ… రాజకీయ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక విమానాలు పంపించి నాయకులను రప్పించి పార్టీ కండువాలు కప్పుతారని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు అలవాటేనని అన్నారు. వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు.