ఈ రోజుల్లో అత్తమామతో ఉండేందుకే ఎవరూ ఇష్టపడటం లేదు. భర్త, పిల్లలు ఉంటే చాలు అనుకుంటున్నారు. దీనికి కారణం..ప్రైవసీ ఒకటి అయితే.. ఆర్థిక సమస్య కూడా..అంత మంది ఉండేంత ఇళ్లులు ఉండటం లేదు..అంతా డబ్బూ లేదు.. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం మాదిరి అయిపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా ఉండటం లేదు. ఎక్కడో ఒకటి రెండూ ఉంటున్నాయి.. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది మామూలు ఉమ్మడి కుటుంబం కాదు.. ఈ ఇంట్లో ఒక్కపూట వండేందుకు కూరగాయలకే వెయ్యి రూపాయలు పైనే అవుతుందట.. అంటే ఎంతమంది ఉంటారో తెలుసా..?
ఉమ్మడి కుటుంబానికి కేరాఫ్‌గా నిలిచిన ఈ కుటుంబంలో అందరూ కలిపి 72 మంది వరకు ఉన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఈ కుటుంబం ఎంతో మందికి ఆదర్శనంగా నిలుస్తోంది. ఈ కుటుంబంలో నాలుగు తరాల వారు ఒకే ఇంట్లో ఉంటున్నారు.. వృద్ధులు, పురుషులు, మహిళలు, పిల్లలు సహా నాలుగు తరాల వారు ఒకే పైకప్పు కింద నివసిస్తున్నారు…వీరి జీవన విధానం, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ భలే విభిన్నంగా ఉన్నాయి.
వర్తక వ్యాపారాన్ని నడుపుతున్న అశ్విన్ దోయిజోడ్ కుటుంబానికి ప్రతి రోజూ 10 లీటర్ల పాలు అవసరం అవుతాయి.. అలాగే, ఒక రోజు ఒక పూట భోజనం చేయడానికి రూ. 1000 నుంచి రూ. 1,200 విలువ చేసే కూరగాయలు వండాల్సి ఉంటుంది. కర్ణాటకకు చెందిన దోయిజోడ్ కుటుంబం.. 100 సంవత్సరాల క్రితమే షోలాపూర్‌కు వలస వచ్చారు. అప్పటి నుంచి వారంతా అక్కడే ఉంటున్నారు. కుటుంబ పెద్ద అయిన అశ్విన్ దోయిజోడ్ మాట్లాడుతూ.. ‘మాది చాలా పెద్ద కుటుంబం. మా పిల్లలు, వారి పిల్లలు అంతా కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాం. కుటుంబ సభ్యులంతా కలిసి 72 మంది ఉంటాం అన్నారు.. ప్రతీపూట భోజనానికి రూ. 1,000 నుంచి రూ. 1,200 విలువైన కూరగాయలు అవసరం పడుతాయి. అదే.. మాంసాహార భోజనం అయితే, మూడు నాలుగు రెట్లు అధికంగా ఖర్చు అవుతుందని చెప్పుకొచచారు.
ఉమ్మడి కుటుంబం విషయంలో, పెరుగుతున్న కుటుంబ సభ్యుల సంఖ్యను చూసి తొలుత ఆందోళనకు గురయ్యామని, ఇప్పుడు మొత్తం కుటుంబంతో కలిసి మెలిసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నామని తెలిపారు.. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ, అందరూ ఆప్యాయంగా, ప్రేమతో ఉంటారట. ఈ ఇంటికి కోడలిగా వచ్చేందుకు చాలా మంది భయపడినట్లు దోయిజోడ్ తెలిపారు. ‘నేను కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని చూసి మొదట్లో భయపడ్డాను. కానీ, అందరూ నాకు సహాయం చేశారు. మా అత్తయ్య, సోదరి, అన్నదమ్ములు అందరూ నేను స్థిరపడేందుకు సహాయం చేశారు.’ అని అశ్విన్ దోయిజోడ్ కోడలు నైనా దోయిజోడ్ తెలిపారు. ఈ బిగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.