సిఐడి అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. A1 గా చంద్రబాబు

-

రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్‌, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్‌, ఏ6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌‌ను చేర్చారు సిఐడి అధికారులు. 120బీ, 420, 34, 35, 36, 37, 166 కింద కేసు నమోదు చేశారు.

2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించారని ఆరోపణలు చేశారు. 454 కి.మీ పాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించాలని తలపెట్టారని…. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news