ఏడేళ్ల చిన్నారి పుస్తకం రాసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మరిపించింది. వివరాల్లోకి వెళితే ప్రతిభకు వయసు కొలమానం కాదు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నప్పటి నుంచి వారి విద్యాభ్యాసం క్రమశిక్షణతో ప్రతిభను ఎప్పటికప్పుడు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు నేటి చిన్నారులు. ఇక తల్లి తండ్రులు సైతం వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక చిన్నారి ఏడేళ్ల వయసులోనే పుస్తకం రాసి అందరిని ఆకట్టుకుంది. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అందించింది.
తన్వి చాపరాల అనే హైదరాబాద్ కి చెందిన ఏడో తరగతి చదివే చిన్నారి… ‘ద క్రియేటివ్ వండర్ లాండ్’ పుస్తకాన్ని తానే స్వయంగా రచించింది. భారతీయ విద్యాభవన్ లో చదువుతున్న ఆ పాప… తల్లిదండ్రులతో పాటు ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లి ఆయనకు తన చేతులు మీదుగా అందించింది. దీనిపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి ప్రతిభను మెచ్చుకున్నారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. భారతీయ విద్యాభవన్‌లో చదువుతున్న ఈ చిన్నారి.. రోజూవారీ జీవితంలో తను గమనించిన అంశాలకు అక్షరరూపం ఇచ్చిందని కొనియాడిన ఆయన…
ఇంత చిన్న వయసులో ఆ చిన్నారి తన భావాలకు కవితలు, కథలు, సూక్తుల రూపాన్ని ఇవ్వడం ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. అదే విధంగా… ప్రతి చిన్నారిలోనూ అద్భుతమైన ప్రతిభాపాటవాలు దాగుంటాయన్న వెంకయ్య.. వారిలోని సృజనాత్మకతకు సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే తన్వి లాంటి పిల్లలెందరో భవిష్యత్ భారతాన్ని మరింత భవ్యంగా మార్చడంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారితో కలిసి దిగిన ఫోటో ని కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.