ఇజ్రాయెల్​కు భారీ షాక్.. హమాస్ దాడిలో 8మంది సైనికులు మృతి

-

దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఇజ్రాయెల్ సైనిక కాన్వాయ్‌పై హమాస్‌ దాడికి తెగబడింది. ఈ దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) ధ్రువీకరించింది. రఫాలోని టెల్‌ సుల్తాన్‌ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్‌ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడీఎఫ్ దళాలు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.

జనవరి తర్వాత గాజా పోరులో ఇంత మంది సైనికులను ఒక దాడిలో ఇజ్రాయెల్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో 21 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజా దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు. 8 మంది సైనికుల్లో ఒకరి పేరు కెప్టెన్ వసీం మహ్మద్ అని ఐడీఎఫ్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news