ఆదోనిలో రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుక

-

పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. కర్నూలు జిల్లా ఆదోని లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ. 931,02 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..

 

దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని, నాణ్యమైన చదువు తోనే పేదరికం పోతుందన్నారు. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చామని తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం తో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఒక్కొ కిట్ విలువ రూ. 2 వేల రూపాయలు అని సీఎం జగన్ అన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అభ్యర్థన మేరకు ఆదోని కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను మంజూరు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news