ఫ్రీ ఫైర్ గేమ్‌ : 13 ఏళ్ల బాలుడు సుసైడ్‌

-

ఈ మధ్య ఆన్‌ లైన్‌ గేమ్స్‌ ఎక్కువయ్యాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దగ్గరి వరకు ఆన్ లైన్‌ గేమ్స్‌ అంటూ ఆడేస్తున్నారు. అయితే..ఈ ఆన్‌ లైన్‌ గేమ్స్‌ ద్వారా చాలా పిల్లలు కూడా సుసైడ్‌ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఇలాంటి ఘటనే మరో బాలుడి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్ అనే ఆన్‌లైన్ గేమ్‌లో ఏకంగా రూ. 40,000 కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఛతర్‌పూర్‌ జిల్లాలోని శాంతి నగర్‌ లో ఈ బాలుడి కుటుంబం నివాసం ఉంటోంది. అయితే.. ఈ మైనర్‌ బాలుడు.. వాళ్ల తల్లిదండ్రులకు తెలియకుండా… ఫ్రీ ఫైర్‌ తరచూ ఆడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈ ఆట కోసం ఏకంగా రూ. 40,000 ఖర్చు చేశాడు. ఈ డబ్బును బాలుడి తల్లికి తెలియకుండానే ఆమె అకౌంట్లో నుంచి తీశాడు. ఒక రోజు రూ. 1500 తీసినట్లు ఆ బాలుడి తల్లి ఫోన్‌ కు మెసేజ్‌ వెళ్లింది. దీంతో ఆ తల్లి… బాలున్ని మందిలించింది.

ఈ నేపథ్యంలో కుమిలిపోయిన ఆ బాలుడు..ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని సుసైడ్‌ చేసుకున్నాడు. అంతేకాదు.. ఆన్‌లైన్ గేమ్‌లో ఏకంగా రూ. 40,000 కోల్పోయనని.. అందుకే సుసైడ్‌ చేసుకుంటానని ఓ లెటర్‌ కూడా రాశాడు. ఇక బాలుడి మృతితో ఆ కుటుంబం విషాదంలోకి వెళ్లింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news