ప్రపంచంలోని కొన్ని నగరాల్లో తాగునీటి బాటిల్‌ను కొనడానికి ఆలోచిస్తారని మీకు తెలుసా..? ఎందుకంటే ఇక్కడ చిన్న వాటర్ బాటిల్‌కు కొనాలంటే ధరలు మండిపోతాయి. అలాంటి నగరాల్లో నార్వే దేశ రాజధాని ఓస్లో నగరం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత ధరను కలిగిన వాటర్ బాటిల్స్ ఇక్కడ దొరుకుతాయి. అమెరికాలోని 30 నగరాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 నగరాల్లో నిర్వహించిన సర్వేలో అత్యధిక ధరను కలిగిన వాటర్ బాటిల్‌లో ఓస్లో నగరం అగ్రస్థానంలో నిలిచింది. టెల్ అవీవ్, న్యూయార్క్, స్టాక్‌హోమ్, హెల్సింకి నగరాలు తర్వాతి వరుసలో ఉన్నాయి. ఈ నగరంలో నివసించే ప్రజలు వాటర్ బాటిల్‌ను కొనడానికి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఓస్లో నగరం పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు పొందింది. ఇక్కడ వాటర్ బాటిల్‌తోపాటు చేతి పంపు నీటి కోసం కూడా అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. పర్యాటకుల తాకిడి, నీటి కొరత ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. నీటి ద్రవ్యోల్బణం విషయంలో ఓస్లో తర్వాత లాస్ ఏంజిల్స్, ఫీనిక్స్, శాన్‌ప్రాన్సిస్కో, శాన్ డియాగో నగరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 20 నగరాల్లో నీటి బాటిళ్ల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఓస్లోలో మాత్రం ఇది అత్యధికం. 120 నగరాల్లో పోలిస్తే 212 శాతం ఇక్కడి చేతి పంపు నీరు ఖరీదు కాగా, వాటర్ బాటిల్ 195 శాతం ఎక్కువ ఖరీదు పలుకుతుంది. ఓస్లోలో అర లీటర్ బాటిల్ ధర సుమారు 2 డాలర్ల వరకు ఉంటుంది.
వాటర్ బాటిల్ ధర పెరగడానికి కారణాలు..
ఓస్లో నగరంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు నార్మల్ వాటర్ కంటే వాటర్ బాటిల్‌పైనే ఎక్కువగా మక్కువ చూపుతారు. ఇక్కడి ప్రజలు కూడా పంపు నీటిని తాగకుండా బాటిల్ నీళ్లలోనే తాగుతారు. నీటి నాణ్యత కూడా బాగుంటుంది. దీంతో వాటర్ బాటిళ్లకు డిమాండ్ పెరిగింది. ఒక సర్వే ప్రకారం చూస్తే 2028 నాటికి ప్రపంచంలోని వాటల్ బాటిల్ మార్కెట్ 505 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ప్రతి సంవత్సరం నీటి ధర 11 శాతం పెరుగుతూ వస్తోందని తెలిపారు.