దెయ్యాల కొంపలు.. వీటి గురించి మనం ఎన్నెన్నో ఊహాగానాలు వింటుంటాం. ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి.. అక్కడికి వెళ్లకండి.. వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం.. అనే మాటలు చక్కర్లుకొడుతుంటాయి. అయితే అలాంటి ఓ ఇల్లు తాజాగా అమ్ముడు పోయి వార్తల్లోకి ఎక్కింది. అవును, 1736లో ఆ ఇల్లును నిర్మించారు. 1971-1980 సంవత్సరం వరకు ఆ ఇంట్లో పెరాన్ కుటుంబం నివసించేది. అప్పట్లో ఆ ఇంట్లో వారు దెయ్యాలతో అనేక ఇబ్బందులు పడ్డారని కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆ విషయాన్ని అప్పట్లో ఎవరూ పెద్దగా నమ్మలేదు.
2013 తర్వాత ఆ ఇంటి వైపు చూడటానికి కూడా చాలా మంది భయపడేవారు. 2013లో కంజ్యూరింగ్ సినిమా తెరకెక్కింది. ఆ ఇంటిలో దెయ్యాలపైనే ఈ సినిమా స్టోరీ. అప్పట్లో ఆ సినిమా బాక్సా ఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. అప్పుడే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అందరికీ తెలిసింది. అయితే, ఆ సినిమా తర్వాత అనేక మంది పరిశోధనలు చేశారు. 2019లో జెన్, కోరి హైన్‌జన్ అనే ఇద్దరు వ్యక్తి ఆ ఇంటిని 4,39,00 డాలర్లకు కొన్నారు. ఆ తర్వాత వారు 1.2 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. అయితే ఆ ఇల్లు ఏకంగా రూ.12 కోట్లు (1.52 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.