కొన్ని కొన్ని సార్లు మూగజీవాలు ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యపోతుంటారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న యజమానిపై జంతువులు చూపించే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. అయితే ఇక్కడొక ఒంటె వృద్ధురాలైనదని దాని యజమాని దాన్ని అమ్మేశాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ ఒంటె మాత్రం యజమానిని విడిచి ఉండలేక పోయింది. కొన్న వ్యక్తులు ఎంతో దూరం తీసుకెళ్ళినప్పటికీ.. అక్కడినుండి తప్పించుకుని యజమాని దగ్గరికి చేరుకున్నది.
వంద కిలోమీటర్లు ఏడురోజులపాటు ఎడారిలో నడిచి యజమాని చెంతకు చేరింది ఒంటె. అక్టోబర్లో ఆ ఒంటెను సంతలో అమ్మగా.. గుండెల్లో బాధని అదిమి పెట్టుకున్న ఆ ఒంటె… తన పాత యజమాని ని వెతుక్కుంటూ వచ్చేసింది. కొంతకాలం క్రితం అమ్మిన ఒంటె తన దగ్గరికి మళ్లీ రావడంతో ఆ యజమాని ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమ్మిన వ్యక్తి దగ్గరనే మళ్ళీ దాన్ని కొనాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆసక్తికరంగా మారింది.