ఉద్యోగాలు మనుషులు చేయాలి..జంతువులు వ్యవసాయం చెయ్యాలి.. ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు జంతువులు కూడా ఉద్యోగం చేస్తున్నాయి.ఏంటి? నిజమా? అనే సందేహం రావడం సహజం.. అవును మీరు విన్నది అక్షరాల నిజం..అది కూడా మేకలకు.. ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ లో 3000 మేకలకు ఉద్యోగాలు ఇచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది..
గూగుల్ ఏంటి మేకలను నియమించుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యంగా లేకున్నా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వార్త ఇదే చెబుతోంది. ఈ నేపథ్యం లో అసలు గూగుల్‌కు అన్ని వేల మేకలతో ఏం పని పడింది? గూగుల్ ఆఫీస్ లో మనుషులు చేయలేని పని మేకలు ఏం చేస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కాస్త వివరాల్లొకి వెల్లాల్సిందే..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతి, యువకులు.. దిగ్గజ టెక్ సంస్థల్లో పని చేయాలని కలలు కంటారు. యువత పని చేయాలని కలలుగనే సంస్థల్లో గూగుల్ కూడా ఒకటి. ఇంతటి గొప్ప సంస్థ.. కాలిఫోర్నియా లోని హెడ్‌క్వార్టర్స్ క్యాంపస్‌లో సుమారు 3500 మేకలను అద్దె తీసుకుని వాటికి పని కల్పించిందట. హెడ్‌క్వార్టర్స్ చుట్టూ విస్తరించి ఉన్న వేల ఎకరాల్లొని గడ్డిని మెయ్యడానికి మేకలను నియమించారట..
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఆలోచించి.. Google ఈ పని చేసిందట. కొన్ని ఎకరాల్లో పెరిగే గడ్డి, మొక్కలను పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల తో నడిచే మెషిన్లతో కట్ చేయడం ద్వారా ఎంతో కొంత పర్యావరణానికి హాని కలుగుతుందని ఆలోచించిందట. అందుకే సహజ సిద్ధ పద్ధతిలో పచ్చిక బయళ్ల నిర్వహణకు Google మేకలను హయర్ చేసుకుందట…మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంది..నెటిజన్లు ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు.