మూడో ఛాన్స్ కోల్పోతున్న వైసీపీ..ఫోకస్ పెట్టాల్సిందే..!

-

వైసీపీకి…గత రెండు ఎన్నికలు ఒక ఎత్తు…ఈ ఎన్నికలు ఒక ఎత్తు… గత రెండు ఎన్నికలు మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదు అన్నట్లే పరిస్తితి ఉంది. 2014లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంత షిఫ్ట్ కావడంతో…తొలిసారి పోటీ చేసి కూడా వైసీపీ సత్తా చాటి 67 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కంచుకోటలు వైసీపీ కంచుకోటలుగా మారిపోయాయి. ఇక 2019 ఎన్నికల్లో తమ కంచుకోటలతో పాటు టీడీపీ కంచుకోటలని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే అధికారంలోకి వచ్చింది.

అధికారంలోకి వచ్చాక వైసీపీ అన్నీ చోట్ల బలపడాలనే దిశగా రాజకీయం చేస్తూ వస్తుంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట కుప్పంని సైతం కైవసం చేసుకోవాలని చూస్తుంది. కానీ పైకి మాత్రమే ఈ రాజకీయం ఉంది…కానీ క్షేత్ర స్థాయిలో గెలిచిన టీడీపీ కంచుకోటల్లో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన స్థానాల్లో కొన్నిటిని వైసీపీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయని

సర్వేల్లో తెలుస్తుంది.

సర్వేల్లో నిజమెంత ఉందా? అనే విషయాన్ని పక్కన పెడితే…ఏ విషయాన్ని తేలికగా తీసుకోకూడదని చెప్పాలి. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో…వైసీపీ గత రెండు ఎన్నికల్లో గెలిచిన కొన్ని సీట్లలో మూడో ఛాన్స్ కోల్పోతుందని తేలింది. అలాంటి స్థానాల్లో పాతపట్నం, ప్రత్తిపాడు, విజయవాడ వెస్ట్, తిరువూరు, బాపట్ల, మంగళగిరి, సంతనూతలపాడు, నెల్లూరు సిటీ, కావలి, పీలేరు, పలమనేరు, నగరి, కదిరి, మైదుకూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కర్నూలు సిటీ, శ్రీశైలం, మంత్రాలయం లాంటి సీట్లలో వైసీపీకి మూడోసారి గెలుపు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలుస్తోంది.

అయితే సర్వే ప్రకారం ఈ సీట్లు అన్నీ కాకపోయినా…ఈ సీట్లలో కొన్ని సీట్లని మాత్రం టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే వరుసగా రెండుసార్లు గెలిచిన సీట్లలో వైసీపీకి మూడోసారి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టి వైసీపీ నేతలు పనిచేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news