బెజవాడలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య రగడ చోటు చేసుకుంది. అయితే… ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు వెల్లంపల్లి, సామినేని ఉదయభాను ఒకరిపై ఒకరు దూషణకు దిగారు. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకలు వేదికగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.
పశ్చిమ నియోజక వర్గంలో ఉన్న ఆకుల శ్రీనివాస్ ను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు ఉదయభాను. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు ఆకుల శ్రీనివాస్. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వెల్లంపల్లి. నా నియోజక వర్గం వారిని సీఎం జగన్ దగ్గరకు తీసుకు వెళ్ళటానికి నువ్వేం పెద్ద మొనగాడివా అని విమర్శలకు దిగారు వెల్లంపల్లి. అయితే, దానికి నీలాగా పార్టీలు మారే ఊసర వెళ్లిని కాదని గట్టిగా బదులిచ్చారు ఉదయభాను. అయితే, వీరి వాగ్వాదం పెరగటంతో ఇద్దరి అనుచరులు కలుగ జేసుకుని..ఆపేశారు.