ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భువనేశ్వర్ లోని రాజ్ భవన్ కు సమీపంలో ఉన్న ఒక పెట్రోల్ పంపులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో… పెట్రోల్ బంక్ లోని సిబ్బంది పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులు అందరూ కూడా భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఇక వెంటనే అక్కడి స్థానికులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ సహాయం కొరకు ఫైర్ స్టేషన్ బుక్ ఫోన్ చేయగా 6 ఫైరింజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.
ఇక వెంటనే అక్కడి స్థానికులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ సహాయం కొరకు ఫైర్ స్టేషన్ బుక్ ఫోన్ చేయగా 6 ఫైరింజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఇక ప్రస్తుతానికి రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిపి వేశారు. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని అక్కడి స్థానికులు తెలియజేశారు. వారికి చికిత్స అందజేసేందుకు ఆస్పత్రికి తరలించారని భువనేశ్వర్ నగర పోలీస్ కమిషనర్ సుధాంశు సారంగి పేర్కొన్నారు.
Odisha: Fire breaks out at a petrol pump near Raj Bhawan in Bhubaneswar
Police Commissioner Sudhanshu Sarangi says, "3 people injured; 6 fire tenders present at the spot." pic.twitter.com/3QyjLjnhkW
— ANI (@ANI) October 7, 2020