రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్…!

-

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురు చెప్పారు. అంతేకాదు వర్షాకాలం పంటను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఇక రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి మరోసారి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

kcr

ఇక కరోనా సమయంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. అంతేకాదు మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి సూచించారు. 17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు, తాలు లేకుండా తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక గ్రామాల్లో వరికోతల కార్యక్రమం నెలా పదిహేనురోజులపాటు సాగుతుందని తెలిపారు. కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలశాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news